Ponguleti: కేటీఆర్ అరెస్టు అంటూ వార్తలు.. పొలిటికల్ బాంబులపై మంత్రి పొంగులేటి హాట్ కామెంట్స్
పొలిటికల్ బాంబులపై మంత్రి పొంగులేటి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కేటీఆర్ ఎలాంటి తప్పు చేయకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti శ్రీనివాస్ Reddy) ప్రశ్నించారు. ఫార్ములా -ఈ కార్ రేసి కేసు (Formula E Car Race Case)లో హైకోర్టు కోర్టు తీర్పు తరువాత కేటీఆర్ (KTR) చేసిన ట్వీట్ పై ఇవాళ చిట్ చాట్ లో మాట్లాడుతూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు ఎప్పటికైనా బయటపడుతుందని తప్పు ఒప్పులు తేల్చేది కోర్టులేనన్నారు. తప్పు చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరన్నారు. కోర్టులు, వ్యవస్థల ముందు బలప్రదర్శన చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కానీ కానీ ఏది బయట పడినా అందులో ఆ కుటుంబం పాత్ర ఉంటున్నదన్నారు. కేసీఆర్ ఏ కేసులో ఉన్నా హరీష్ కూడా ఆ కేసుల్లో ఉంటున్నారని చెప్పారు. కాళేశ్వరం, విద్యుత్, ఈ ఫార్ములపై విచారణను బీఆర్ఎస్ వారే అడిగారని కక్షపూరితంగా, ఉద్దేశపూరితంగా చేసింది ఏమీలేదన్నారు. తప్పులు చేశారు కాబట్టే అన్ని బయటపడుతున్నాయని జైలుకు వెళ్తేనే సీఎం అవుతాను అనుకుంటే కేటీఆర్ కంటే ముందు వరుసలో కవిత (Kavitha) ఉన్నారన్నారు. సియోల్ బాంబులు (Political Bombs) పేలడం మొదలు అవుతున్నాయని విద్యుత్ కమిషన్ రిపోర్ట్ వచ్చిందని దీనిపై ప్రభుత్వం లీగల్ ఒపినియన్ తీసుకుంటున్నదని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు.
బీఆర్ఎస్ కు అంత డబ్బెక్కడిది?:
గ్రీన్ కో అనుబంధ సంస్థల నుంచి బీఆర్ఎస్ (BRS) కు పెద్దఎత్తున ఎలక్టోరల్ బాండ్లు రావడంపై స్పందించిన పొంగులేటి.. ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక ధనిక పార్టీ బీఆర్ఎస్ అని అంత డబ్బు ఆ పార్టీకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. బాండ్స్ మాత్రమే కాదు ఇంకా బయట పడాల్సినవి చాలా ఉన్నాయని విదేశీ కంపెనీకి వెళ్లిన డబ్బులు ఎవరి ఖాతాకు వెళ్ళాయో తేలాలన్నారు. కాంగ్రెస్ (CONGRESS) పార్టీకి బాండ్స్ ఎందుకు ఇచ్చారో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీనే చెప్పాలని ప్రశ్నించారు. జాతీయ పార్టీలకు లేని నిధులు ప్రాంతీయ పార్టీకి ఎలా వచ్చాయో చెప్పాలన్నారు.
భూభారతి బిల్లు గవర్నర్ వద్ద ఉంది:
భూభారతి (Bhabharati) బిల్లు గవర్నర్ వద్ద ఉందని గవర్నర్ నుంచి అనుమతి రాగానే గెజిట్ విడుదల అవుతుందన్నారు. రూల్స్ ప్రేమ్ చేయడానికి రెండు నెలల టైమ్ పడుతుందని చెప్పారు. సంక్రాంతి పండుగ తరువాత ధరణికి సంబంధించిన రికార్డులను ఫోరెన్సిక్ ఆడిట్ కోసం ప్రైవేట్ సంస్థలకు ఇవ్వబోతున్నామని చెప్పారు. భూదాన్, దేవాదాయ, అసైండ్ భూముల్లో జరిగిన కుంభకోణాలు అన్నీ ఫోరెన్సిక్ ఆడిట్ లో బయట పడతాయని చెప్పారు. సిరిసిల్లలో 2వేల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయింది. రంగారెడ్డి, మెదక్, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన భూ బాగోతం ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాత బయట పడుతుంది.