తెలంగాణకు ఎందుకు ఇవ్వరు..? ప్రధాని మోడీపై కేటీఆర్ సెటైర్లు

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి.

Update: 2023-05-02 11:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రజలను అకట్టుకునేందుకు అధికార బీజేపీ అదిరిపోయే రీతిలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కర్నాటక ప్రజలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని బీజేపీ తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కాగా, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార బీజేపీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

  గతంలో ఉచిత స్కీమ్‌ల కల్చర్ మంచిది కాదని ప్రధాని మోడీ అన్నారని.. మరీ కర్నాటక ప్రజలకు ఇప్పుడు ఉచితంగా మూడు సిలిండర్లు ఎలా ఇస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. కర్నాటక ప్రజలకు ఇచ్చినప్పుడు మరీ తెలంగాణ ప్రజలకు ఆ మూడు సిలిండర్లు ఎందుకు ఉచితంగా ఇవ్వరన్నారు. మోడీ కేవలం కర్నాటకకే ప్రధాని అన్నట్లు వ్యవహరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మిగిలిన రాష్ట్రాల్లో ప్రజలు లేరా.. వాళ్లకు ఓట్లు లేవా అని నిలదీశారు. 

Tags:    

Similar News