‘ఇది మా అన్న రేవంత్ రెడ్డి వల్లే సాధ్యమైంది’.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల(BC Reservations)కు సంబంధించిన బిల్లును తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ఆమోదించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల(BC Reservations)కు సంబంధించిన బిల్లును తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ఆమోదించిన విషయం తెలిసిందే. పార్టీలకు అతీతంగా సభ్యులంతా ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. తాజాగా.. దీనిపై మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.

‘తెలంగాణలోని బీసీలందరికీ నిజమైన స్వాతంత్రం వచ్చిన శుభదినం.. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం హర్షణీయం.. ఇది మా అన్న, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Ponnam Prabhakar Goud) వల్లే సాధ్యమైంది. ఈ బిల్లు ఆమోదం పొందటం యావత్ దేశానికి ఆదర్శం. ఈ నిర్ణయాన్ని యావత్ బీసీ బిడ్డలంతా స్వాగతిస్తున్నారు. అందుకే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రివర్గ సహచరులను ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు చెప్పాను’ అని సోషల్ మీడియా వేదికగా మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.
తెలంగాణలోని బీసీలందరికీ నిజమైన స్వాతంత్రం వచ్చిన శుభదినం..
— Konda Surekha (@iamkondasurekha) March 18, 2025
స్థానిక సంస్థల్లో విద్యా, ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని శాసనసభలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఇవ్వడం హర్షణీయం..
ఇది మా సీఎం @revanth_anumula అన్న, పీసీసీ చీఫ్ @Bmaheshgoud6666 , బీసీ సంక్షేమ శాఖ… pic.twitter.com/aAyv7ng7nO