TG: పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నాం.. మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

పారిస్‌‌(Paris)లో జరిగిన పారాలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ఓరుగ‌ల్లు ముద్దుబిడ్డ, పారా అథ్లెట్ దీప్తి జీవాంజి(Para athlete Deepthi Jeevanji)కి కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డు ప్రకటించడం పట్ల మంత్రి కొండా సురేఖ(Konda Surekha) హర్షం వ్యక్తం చేశారు.

Update: 2025-01-02 12:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: పారిస్‌‌(Paris)లో జరిగిన పారాలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ఓరుగ‌ల్లు ముద్దుబిడ్డ, పారా అథ్లెట్ దీప్తి జీవాంజి(Para athlete Deepthi Jeevanji)కి కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డు ప్రకటించడం పట్ల మంత్రి కొండా సురేఖ(Konda Surekha) హర్షం వ్యక్తం చేశారు. మానసిక సామర్థ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, కుంగిపోకుండా, విధిని ఎదిరించి తన శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటిన అథ్లెట్ దీప్తి జీవాంజి ప్రస్థానం ఎందరికో స్ఫూర్తినిచ్చిందని అన్నారు. దీప్తి జీవాంజికి తమ సహకారం ఎల్లవేళలా వుంటుందని మంత్రి తెలిపారు. దీప్తి మరెన్నో కీర్తి శిఖరాలను అధిరోహించాలని మంత్రి సురేఖ ఆకాంక్షించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడారంగంలో అత్యున్నతంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం(Congress Govt) పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నదని మంత్రి సురేఖ తెలిపారు. ఈ కార్యాచరణలో భాగంగా ఈ మధ్యే యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తుచేశారు. సీఎం కప్ పేరుతో పోటీలు నిర్వహించి గ్రామీణుల్లో దాగిన ప్రతిభను వెలికితీస్తున్నామని అన్నారు. త్వరలోనే అత్యుత్తమ క్రీడాపాలసీని తీసుకువచ్చి దేశంలోనే క్రీడల రాజధానికిగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

Tags:    

Similar News