రాహుల్ బొజ్జాను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి

ఇటీవల కన్నుమూసిన పౌర హక్కుల నేత బొజ్జా తారకం సతీమణి, సీనియర్ ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా మాతృమూర్తి.. ప్రముఖ రచయిత్రి బి. విజయభారతి సంస్మరణ కార్యక్రమానికి రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు.

Update: 2024-10-06 16:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల కన్నుమూసిన పౌర హక్కుల నేత బొజ్జా తారకం సతీమణి, సీనియర్ ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా మాతృమూర్తి.. ప్రముఖ రచయిత్రి బి. విజయభారతి సంస్మరణ కార్యక్రమానికి రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఆమె చిత్రపటానికి పూలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా రాహుల్ బొజ్జను మంత్రి కోమటిరెడ్డి పరామర్శించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగులో డాక్టరేట్‌ పొందిన మొట్టమొదటి దళిత మహిళ విజయభారతి అని గుర్తు చేసుకున్నారు. ఆమె తండ్రి బోయి భీమన్న అద్భుతమైన రచనలు చేశారని.. వారి వారసత్వాన్ని పునికిపుచ్చుకొని విజయభారతి కూడా ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యంలో విశేష కృషి చేశారని కోమటిరెడ్డి నెమరువేసుకున్నారు.


Similar News