పాతబస్తీకి వస్తే తీవ్ర పరిణామాలుంటాయి.. హైడ్రాకు ఎంఐఎం ఎమ్మెల్యేల హెచ్చరిక

హైడ్రా(HYDRA) అధికారులకు ఎంఐఎం ఎమ్మెల్యేలు(MIM MLAs) వార్నింగ్ ఇచ్చారు.

Update: 2024-09-30 15:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా(Hydraa) అధికారులకు ఎంఐఎం ఎమ్మెల్యేలు(MIM MLAs) వార్నింగ్ ఇచ్చారు. సోమవారం హైడ్రాకు వ్యతిరేకంగా బహదూర్‌పురా(Bahadurpura)లో ఎంఐఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ‘మా ఇలాఖాలోకి వచ్చే ధైర్యం ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. పాతబస్తీలో సర్వేకు వస్తే తీవ్ర పరిణామాలుంటాయి. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి వస్తే.. బుల్డోజర్లు మాపైనుంచి తీసుకెళ్లా్ల్సి వస్తుంది’ అని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే హైడ్రా కూల్చివేతలపై అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందన్న వార్తల నేపథ్యంలో అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. ‘కావాలంటే మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి. కత్తులతో దాడి చేయండి.. కానీ పేదల విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడకండి’ అని అక్బరుద్దీన్ కామెంట్లు చేశారు. పేదలకు ఉచిత విద్యను అందించేందుకు బిల్డింగ్‌ నిర్మించామని.. వాటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారన్నారని అసదుద్దీన్ సైతం తీవ్రంగా స్పందించారు.


Similar News