రేపు రాత్రి హైదరాబాద్‌కు సీఎం రేవంత్.. అసలు వెళ్లిన పనేంటో తెలుసా?

అనారోగ్యంతో బాధపడుతున్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను పరామర్శించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు.

Update: 2024-09-30 17:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అనారోగ్యంతో బాధపడుతున్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను పరామర్శించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. తిరిగి మంగళవారం రాత్రికి హైదరాబాద్ రానున్నట్లు సీఎంఓ వర్గాల సమాచారం. కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో అనారోగ్యానికి గురైన మల్లికార్జున్ ఖర్గేను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.

వైద్య చికిత్స పొందుతున్న ఆయనను పరామర్శించేందుకే సీఎం ఢిల్లీ వెళ్లారని సీఎంఓ వర్గాలు తెలిపాయి. హర్యనా, కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో హైకమాండ్ నేతలు బిజీగా ఉన్నందున వారితో సమావేశమయ్యే అవకాశం లేదని, కేవలం ఈ ఒక్క పని మీద మాత్రమే ఆయన ఢిల్లీ వెళ్లారని పేర్కొన్నాయి. ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అక్టోబరు 5న పూర్తవుతున్నందున ఆ తర్వాత మరోసారి వెళ్ళి హైకమాండ్ నేతలతో సమావేశమయ్యే అవకాశమున్నది.


Similar News