నంది అవార్డుల పేరు మార్పుపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి

పద్మ అవార్డు గ్రహీతలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఆదివారం శిల్పకళా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు అవార్డు గ్రహీతలను సత్కరించారు.

Update: 2024-02-04 07:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: పద్మ అవార్డు గ్రహీతలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఆదివారం శిల్పకళా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు అవార్డు గ్రహీతలను సత్కరించారు. సత్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. అవార్డు ప్రకటన కంటే ఈ సత్కారం మరింత ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. అవార్డు ప్రకటన తర్వాత ఇలాంటి సన్మానాలు జరుగడం ఇదే తొలిసారి.. స్వయంగా ప్రభుత్వం చొరవచూపి తమను సన్మానించడం హర్షించదగిన విషయమని అన్నారు.

మరోవైపు నంది అవార్డులను గద్డర్ అవార్డులుగా మార్చడం వ్యక్తిగతంగా తనకు కూడా చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఎక్కడ కళాకారులను గౌరవిస్తారో ఆ రాజ్యం చాలా సుభిక్షంగా ఉంటుందని అన్నారు. పద్మ విభూషన్ అవార్డు ప్రకటన చూసిన నాకు పట్టలేనంత ఆనందం కలిగిందని తెలిపారు. నా అభిమానుల ఆశీర్వాదం చూస్తుంటే నా జన్మ ధన్యమైపోయిందనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో వెంకయ్యనాయుడు నిజమైన రాజనీతిజ్ఙుడు అని కొనియాడారు. వాజ్‌పేయి అంత హుందాతనం వెంకయ్యలో ఉందని అన్నారు. తమను సన్మానించిన ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు.

Tags:    

Similar News