T Congress: కేసీ వేణుగోపాల్ తో టీ కాంగ్రెస్ ఎంపీల భేటీ
కేసీ వేణుగోపాల్ తో టీ కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) తో తెలంగాణ కాంగ్రెస్ (T Congress) ఎంపీలు భేటీ అయ్యారు. ఇవాళ పార్లమెంట్ కార్యాలయంలో కేసీ వేణుగోపాల్ ను కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్, బీసీ కుల గణన, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు వంటి కీలక అంశాలతో పాటు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలపై చర్చించారు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాల అమలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ భేటీలో చామల కిరణ్ కుమార్ రెడ్డి, సురేశ్ షట్కర్, రామసహాయం రఘురామ్ రెడ్డి, మల్లురవి, గడ్డం వంశీ, బలరామ్ నాయక్, కడియం కావ్య ఉన్నారు.