యువకుడి ఆత్మహత్య

ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కంసారి బజార్ లో సోమవారం చోటుచేసుకుంది.

Update: 2023-02-20 16:58 GMT

దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కంసారి బజార్ లో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కంసారి బజార్ కు చెందిన ప్రవీణ్ (27) ప్రైవేటు ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా ఇతని మానసిక పరిస్థితి ఏమాత్రం బాగో లేదు. అప్పుడప్పుడు రాత్రి సమయాల్లో రోడ్లపైనే కాలక్షేపంచేస్తూ, ఫుట్ పాత్ ల పైనే నిద్రిస్తుండే వాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కంసారి బజార్ ప్రాంతంలో ఉన్న మంచి నీటి కోసం ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన షెడ్ రాడ్ కు ఓ వైర్ తో ప్రవీణ్ ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. గమనించిన స్థానికులు బోయిన్ పల్లి పోలీసుల కు సమాచారం అందజేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News