ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలి
ప్రజా సమస్యల పరిష్కరమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు.
దిశ, మేడ్చల్ బ్యూరో : ప్రజా సమస్యల పరిష్కరమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 94 దరఖాస్తులను ఇన్చార్జి డీఆర్వో శంకర్ కుమార్ తో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ వివిధ శాఖలలో ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందిస్తూ వాటిని వెంట వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వినతులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఆన్ లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలని సూచించారు.