హైడ్రాకు చట్టబద్దత ఉందా

హైడ్రాకు చట్టబద్దత ఉందా అని ఎమ్యెల్సీ శంభిపూర్ రాజు సూటిగా ప్రశ్నించారు.

Update: 2024-12-22 12:12 GMT

దిశ, దుండిగల్ : హైడ్రాకు చట్టబద్దత ఉందా అని ఎమ్యెల్సీ శంభిపూర్ రాజు సూటిగా ప్రశ్నించారు. శంభిపూర్ లోని ఎమ్యెల్సీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం లో అభివృద్ధికి తిలోదాకాలిస్తూ హైడ్రా పేరుతో సామాన్య ప్రజల నడ్డివిరుస్తుందని అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో అభివృద్ధిలో అగ్రభాగాన లిపిందని, హైదరాబాద్​ నగరాన్ని అందరం కలిసి విశ్వనగరంగా తీర్చుదిద్దితే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా అనే భూతం ద్వారా నిరుపేదల ఇళ్లను కూల్చుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు.

    హైడ్రాకు అసలు చట్టబద్దత ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హైడ్రా పేరుతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్నారు. ఇరిగేషన్,హెచ్ఎండీఏ అనుమతులు ఉండి బ్యాంకు ల ద్వారా లోన్లు పొందిన భవనాలను కూడా హైడ్రా పేరుతో రాత్రికి రాత్రి కూల్చివేస్తున్నారని, పేదల ఇళ్లను కూల్చివేస్తూ పెద్దల ఇళ్లకు నోటీస్ లు ఇస్తూ వివక్ష చూపుతున్నారన్నారు. అడిగితే కేసులు పెడుతూ వేధిస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమాలు చేసి జైలుకు వెళ్లిన చరిత్ర తమదని, అక్రమాలు చేసి జైలుకు వెళ్లిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ నాయకులదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రదక్తేలేదన్నారు. 


Similar News