మా ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం అందిస్తున్నాం.. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి

ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తామో అక్కడ దేవతలు కొలువై ఉంటారని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి... Women's day celebrations

Update: 2023-03-09 09:54 GMT

దిశ, కంటోన్మెంట్: ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తామో అక్కడ దేవతలు కొలువై ఉంటారని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం తిరుమలగిరి లాల్ బజార్ లోని ఆర్య వైశ్య కల్యాణమండపంలో బోర్డు మాజీ సభ్యులు ప్యారసాని భాగ్యశ్రీ, శ్యామ్ కుమార్ ల నేత్రుత్వంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ... మహిళలు అన్నిరంగాల్లో రాణించాలన్నారు. మహిళలు లేనిదే మానవ సృష్టి లేదని, మహిళలు లేనిది ఒక్క నిమిషం గడవదని, తల్లిగా, చెల్లిగా, భార్యగా అనేక పాత్రలు సమర్ధవంతంగా పోషిస్తోందని ఆయన కొనియాడారు. నమ్మకం, నిజాయితీతో ముందుకు వెళితే సాధించలేనిదేది ఉండదన్నారు. మహిళలు ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారని, సమాజంలో ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతీ ఒక్క మహిళ ఒక లక్ష్యం పెట్టుకుని నిజాయితీగా ప్రయత్నించి అనుకున్న రంగంలో రాణించాలని సూచించారు. మహిళా సంక్షేమానికి పలు కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. పెన్షన్లు, వడ్డీలేని రుణాలు, భరోసా కేంద్రాలు, షీటీమ్స్‌ లాంటి ఎన్నో కార్యక్రమాలు రాష్ట్రంలో అమలులో ఉన్నాయన్నారు.

మానవ నాగరికత వికసించడానికి మహిళలది కీలక పాత్ర అన్నారు. పనిలో పడి ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేసే మహిళలకు సీఎం కేసీఆర్‌ ఆరోగ్య ప్రదాతగా నిలిచారని చెప్పారు. అదేవిధంగా దుండిగల్ లోని తమ అరుంధతీ ఆసుపత్రిలో మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని వ్యాధులకు సంబంధించి ఉచితంగా వైద్యం అందిస్తున్నామని, దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. మహిళలు ఆత్మన్యూనతాభావాన్ని విడనాడాలని, కష్టపడి ముందుకుసాగాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళ పట్ల గౌరవంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దిశగా చర్యలు తీసుకుంటోందని అన్నారు. ప్రభుత్వం మహిళలకు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిందని చెప్పారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదని, అన్నిస్థాయిల్లో ఎదగాలని ఉద్భోదించారు. అనంతరం ఆటల పోటీలు, కోలాటాలతో మహిళలు ఆడిపాడారు. కార్యక్రమాల్లో విజేతలకు మర్రి రాజశేఖర్ రెడ్డి బహుమతులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీ సభ్యులు పాండుయాదవ్ , పార్టీ సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్, నేతలు ప్రవీణ్ యాదవ్, రాజారెడ్డి తో పాటు ఏడో వార్డుకు చెందిన మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News