మల్లాపూర్‌లో రిజర్వాయర్‌ను ముట్టడించిన మహిళలు
ఖాళీ బిందెలతో మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నది.. ఎక్కడో గ్రామీణ మారుమూల ప్రాంతం అనుకుంటున్నారా..? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే..!
దిశ, నాచారం: ఖాళీ బిందెలతో మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నది.. ఎక్కడో గ్రామీణ మారుమూల ప్రాంతం అనుకుంటున్నారా..? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే..! విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న నగరం నడిబొడ్డున ఉన్న నాచారం పక్కన ఉన్న మల్లాపూర్ ప్రాంతం. గత ఆరు నెలలుగా మల్లాపూర్ బీరప్ప గడ్డ కాలనీ లో తాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. ఈ ప్రాంతంలో పేద తరగతి కుటుంబాలు అధికంగా జీవనం సాగిస్తున్నారు.
వీరికి డబ్బులు కొనుగోలు చేసి ఫిల్టర్ వాటర్ కొన్ని స్తోమత లేదు. అస్తవ్యస్తమైన నీటి సరఫరా తో ఆగ్రహించిన మహిళలు ఖాళీ బిందెలతో సమీపంలోని నీటి రిజర్వాయర్ వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. రిజర్వాయర్ నుంచి వృధాగా త్రాగునీరు పోవడంతో పాటు వేద కాలనీలో నీటి లీకేజీలు ఏర్పడిన మరమ్మతులు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరమ్మత్తుల పేరిట నెలల తరబడి కాలయాపన చేస్తూ కాలనీలకు నీటి సరఫరా చేయకుండా జలమండలి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మహిళలు ఆరోపించారు.
పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని వాపోయారు. రిజర్వాయర్ పక్కన.. తప్పని కష్టాలు: మల్లాపూర్ లో తాగునీటి నిలువల కోసం మల్లాపూర్ ఎన్ఎఫ్ సీ చౌరస్తా దగ్గర రిజర్వాయర్ నిర్మించారు. రిజర్వాయర్ పక్కన బీరప్ప గడ్డ ప్రాంతం ఉంది. అయినప్పటికిని గత ఆరు నెలలుగా నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. రిజర్వాయర్ పక్కన ఉన్న కాలనీలో పరిస్థితి ఇలాగే ఉందంటే.. ఇతర ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.