ఆర్టీసీ బస్సుపై ఇద్దరు దుండగుల దాడి

ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తులు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత

Update: 2024-06-26 16:27 GMT

దిశ,ఉప్పల్ : ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తులు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. నిత్యం లక్షలాది మందిని క్షేమంగా గమ్యస్థానానికి చేర్చే ఆర్టీసీ బస్సుల పై ఇద్దరు దుండగులు రాళ్లతో దాడి చేసిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే రామంతాపూర్ డివిజన్ వెంకట్‌ రెడ్డి నగర్‌ బస్ స్టాప్ లో ఉప్పల్‌ డిపో కు చెందిన 18 వీ/జే రూట్‌ నైట్‌ హాల్ట్‌ బస్సుపై ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు దుండగులు రాళ్లతో దాడి చేశారు.ఈ దాడిలో బస్సు అద్దం పూర్తిగా ధ్వంసమైంది.ఈ ఘటనను టీజీఎస్ఆర్టిసి యాజమాన్యం సీరియస్‌గా తీసుకుని బాధ్యులపై చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిపో మేనేజర్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News