బోడుప్పల్‌లో నెగ్గిన అవిశ్వాసం.. కాంగ్రెస్ ఖాతాలోకి మరో కార్పొరేషన్

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి

Update: 2024-06-29 09:39 GMT

దిశ,మేడిపల్లి: మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి పై అలానే, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ పై కాంగ్రెస్ నాయకులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఎప్పటి నుండో విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తమ ఖాతాలోకి మరో కార్పొరేషన్ ను కైవసం చేసుకుంది. బోడుప్పల్ లో మొత్తం 28 కార్పొరేటర్లకు గాను కాంగ్రెస్ వైపు 22 మంది కార్పొరేటర్లు మద్దతుగా ఉండగా బీఆర్ఎస్ కు 6 గురు కార్పొరేటర్లు నిలిచారు. ఉదయం 11.30 కు ప్రారంభమై మధ్యాహ్నం 1 కు ముగిసింది. అవిశ్వాస తీర్మానానికి బీ ఆర్ ఎస్ కార్పొరేటర్లు హాజరు కాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది.

కీసరా ఆర్డీఓ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పాలన దిశగా కాంగ్రెస్ నాయకులు అడుగులు వేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు బోడుప్పల్ ను అభివృద్ధి దిశగా తీసుకుపోతామని సహకరించిన కార్పొరేటర్లకు మేయర్ తోటకూర అజయ్ యాదవ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాలిపేద్ది శరత్ చంద్రారెడ్డి, పోగుల నర్సింహా రెడ్డి, రాపోలు రాములు,పీఎంసీ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Similar News