అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా

అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ కె.సత్యనారాయణ రావు అక్రమ నిర్మాణదారులు హెచ్చరించారు.

Update: 2024-07-01 12:43 GMT

దిశ, దుండిగల్ : అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ కె.సత్యనారాయణ రావు అక్రమ నిర్మాణదారులు హెచ్చరించారు. దుండిగల్ మున్సిపాలిటీ, మల్లంపేటలో అనుమతులకు మించి నిర్మించిన 3 నిర్మాణాలను మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో టీపీఓ సంజున, టౌన్ ప్లానింగ్ సిబ్బంది సతీష్, తిరుపతి, వేణు, రాము సోమవారం మాదాసు కాలనీలో వెలసిన అక్రనిర్మాసనాలను భారీగా కూల్చివేతల చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మల్లంపేటలో వెలసిన 3 అపార్ట్మెంట్ స్లాబ్ లను,గోడలను కూల్చి వేసినట్లు తెలిపారు.

Similar News