BREAKING : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అరెస్ట్

జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు.

Update: 2024-07-01 08:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. గాంధీలో దీక్ష చేస్తున్న మోతీలాల్‌ను పల్లా రాజేశ్వర్ రెడ్డి కలిసేందుకు వచ్చారు. దీంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్‌కు పోలీసులు తరలించారు. అయితే గాంధీ ఆస్పత్రిలో ఉద్యోగ నోటిఫికేషన్లపై నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి వారం రోజులుగా ఆస్పత్రిలోనే విద్యార్థి నేత మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. నిన్న రాత్రి ఆయనను కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కలిసి కాసేపు చర్చించారు. 


నిరుద్యోగుల సమస్యపై హరీష్ రావు మరోసారి ఆసక్తికర ట్వీట్ ఇదే

Similar News