Trishna Montessori School : షెడ్ లో విద్యాబోధన..

ఉప్పల్ భగాయత్ లో ఎలాంటి పర్మిషన్ లేకుండా షెడ్డు నిర్మించి, స్కూల్ పేరు బోర్డు లేకుండా విద్యాబోధన చేపట్టుతున్న త్రిష్ణ మాంటెస్సోరి స్కూల్ యాజమాన్యం.

Update: 2024-08-05 10:34 GMT

దిశ, ఉప్పల్ : ఉప్పల్ భగాయత్ లో ఎలాంటి పర్మిషన్ లేకుండా షెడ్డు నిర్మించి, స్కూల్ పేరు బోర్డు లేకుండా విద్యాబోధన చేపట్టుతున్న త్రిష్ణ మాంటెస్సోరి స్కూల్ యాజమాన్యం. షెడ్ నిర్మాణం అంటే అవి కమర్షియల్ నిర్మాణాల కిందికి వస్తాయి. అలాంటి షెడ్ నిర్మాణాలలో విద్యాబోధనకు విద్యాశాఖ అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

రేపు జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒక స్కూల్ పెట్టాలంటే విద్యాశాఖ నుంచి పర్మిషన్ తీసుకుని నియమ నిబంధనలు పాటిస్తూ స్కూలును ఏర్పాటు చేయాలి. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి నిబంధనలు పాటించకుండా అక్రమ షెడ్ లో స్కూలు ఏర్పాటు చేసి విద్యా బోధన చేస్తున్నారు. ఈ విషయం పై విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని షెడ్ లో విద్యాబోధన చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

టీపీఓ సురేష్ వివరణ : టౌన్ ప్లానింగ్ నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండానే షెడ్డు నిర్మించారన్నారు. ఈ విషయం మాకు తెలిసిన వెంటనే నోటీసులు జారీ చేశామని టీపీఓ సురేష్ తెలిపారు.

Tags:    

Similar News