దేశానికే మార్గదర్శకంగా తెలంగాణ గ్రామ పంచాయతీలు: మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ గ్రామపంచాయతీలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు.

Update: 2023-05-29 12:29 GMT

దిశ, మేడ్చల్ టౌన్: తెలంగాణ గ్రామపంచాయతీలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం మేడ్చల్ మండలంలోని గౌడవెల్లి, బండ మాదారం, నూతనకల్, డబిల్ పూర్, రాజా బొల్లారం, రాజా బొల్లారం తండా, రావలకోల్, సోమారం గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపు కోటి 50లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. కేసీఆర్ సారధ్యంలో ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు.

సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీలన్నీ పచ్చని హరివిల్లుగా మారాయని, గత పాలకుల నిర్లక్ష్యంతో రాష్ట్రంలోని ఒక్క గ్రామ పంచాయతీకి కూడా నిధులు కేటాయించలేదని, అలాంటిది స్వరాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రతి పల్లెకు ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు కేటాయించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, రైతు బందు జిల్లా అధ్యక్షులు నందరెడ్డి, ఎంపీపీ రజిత రాజ మల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజ విజేయందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేష్, ఎంపీటీసీలు, అంకిత రవి , సర్పంచులు డబిల్ పూర్ సర్పంచ్ గీత భాగ్యరెడ్డి, రావల్ కోల్ సర్పంచ్ మహేందర్ నూతనకల్ సర్పంచ్ చిన్నోళ్ల కవిత జీవన్, శ్యామల ప్రభాకర్ రెడ్డి, మంగ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News