గ్రేవ్ యార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి
కంటోన్మెంట్ ప్రాంతంలో పాస్టర్స్ కమ్యూనిటీ సౌకర్యార్దం ప్రత్యేకంగా గ్రేవ్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు సహకారం అందించాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం కలిసి వినతి పత్రం అందజేశారు.
దిశ, తిరుమలగిరి : కంటోన్మెంట్ ప్రాంతంలో పాస్టర్స్ కమ్యూనిటీ సౌకర్యార్దం ప్రత్యేకంగా గ్రేవ్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు సహకారం అందించాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రాంతంలో ఇండిపెండెంట్ పాస్టర్స్ కమ్యూనిటీ కోసం ప్రత్యేక గ్రేవ్ యార్డ్ ఏర్పాటు చేయాలని కోరుతూ గతంలోనే పాస్టర్స్ వినతిపత్రం అందజేశారని, ఈ విషయంలో ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలని సీఎంను కోరినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఇండిపెండెంట్ పాస్టర్స్ సంఘం ప్రతినిధులు తనను కలవడానికి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.వారి సమస్య పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.