లక్ష్యాలను ఏర్పర్చుకొని ముందుకు సాగాలి

నూతన సంవత్సరంలో మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా ప్రజలు అన్ని రంగాల్లో రాణించి సుఖసంతోషాలతో విలసిల్లాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ కోరారు.

Update: 2024-12-31 11:35 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : నూతన సంవత్సరంలో మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా ప్రజలు అన్ని రంగాల్లో రాణించి సుఖసంతోషాలతో విలసిల్లాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ కోరారు. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకొని ప్రణాళికాబద్దంగా వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలన్నారు. ఆంగ్ల నూతన సంవత్సరం –2025 లో ప్రజలు కొత్త ఆలోచనలు, సరికొత్త నిర్ణయాలు, మంచి ఆశయాలతో ముందుకెళ్లాలని సూచించారు.

    నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని తీసుకురావాలని కోరారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత ఉన్నతాశయాలను ఏర్పర్చుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలన్నారు. అలాగే ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటిస్తూ కొత్త సంవత్సర వేడుకలను సంయమనంతో జరుపుకోవాలని కోరారు. జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అభిలాషించారు. కొత్త ఏడాదిలో ఎల్లవేళలా అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.  


Similar News