ఆహార ఉత్పత్తుల పేరుతో తప్పుడు మందుల విక్రయాలు..

ఆహార ఉత్పత్తులు, న్యూట్రాస్యూటికల్‌ పేరుతో అనుమతులు

Update: 2024-06-26 12:49 GMT

దిశ,మేడ్చల్ బ్యూరో : ఆహార ఉత్పత్తులు, న్యూట్రాస్యూటికల్‌ పేరుతో అనుమతులు లేకుండా మందులు విక్రయిస్తున్న వ్యక్తులపై ఔషధ నియంత్రణ అధికారులు కొరడా ఝుళిపించారు. అనుమతి లేని మందులతోపాటు నిర్ణత ధరలకు కాకుండా అధిక ధరలకు అమ్మకాలు జరుపుతున్నట్లు అందిన సమాచారం మేరకు డ్రగ్‌ కంట్రోలు అధికారులు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో రెండు రోజులుగా దాడులు నిర్వహిస్తూ పలువురిపై కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్‌ మల్కాజి గిరి జిల్లా కాప్రాలో మూపిపాన్‌ అనే అయింట్‌మెంట్‌ తోపాటు కామారెడ్డి జాండి క్యాప్సూల్‌ (200 గ్రా.) ను నిబంధలనుకు వ్యతిరేకంగా అమ్మకాలు జరుపుతున్నట్లు డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు గుర్తించారు.మరో కొన్ని మందులను తప్పుడు ప్రకటనలు చేసి అమ్మకాలు జరుపుతున్న మందులను కూడ డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు గుర్తించారు. ఈ మేరకు సుప్రాల్‌ పిల్లల అల్లోపతి ఔషదాం జ్వరానికి పని చేస్తుందాని తప్పుడు ప్రచారంతో అమ్మకాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. ఇదే తీరులో శ్రీతులసి డ్రాప్స్‌ జ్వరానికి పని చేస్తుందాని తప్పుడు ప్రచారంతో అమ్మకాలు సాగిస్తునట్లు, తులసి జింజర్‌ డ్రాప్స్‌ న్యూమోనియాకు పని చేస్తుందాని తప్పుడు ప్రచారం చేసి అమ్మకాలు సాగిస్తూ ఉండడంపై డ్రగ్‌ కంట్రోల చర్యలు చేపట్టింది.

వనపర్తి, గోసాల్‌పేట్‌ మండలం తాడిపర్తిలో ఒక క్లినిక్‌పై దాడులు నిర్వహించి అమ్మకానికి నిల్వ చేసిన మందులను స్వాధీనం చేసుకున్నారు. 52 రకాల మందలను అనుమతులు లేకుండా నిర్వచేయడం పై కేసు నమోదు చేశారు. రూ. లక్షల మేరకు మందులను సీజ్‌ చేశారు. క్లినిక్‌ను సైతం సీజ్‌ చేశారు. సిద్దిపేట మండలంలో కాల్‌గ్రిప్‌ ట్యాబ్లెట్స్‌ గుర్తించారు. ఈ టాబ్లెట్ల ను పుడ్‌ లైసన్స్‌ కింద` తప్పుడుగా అమ్మకాలు జరుపుతున్నట్లు డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు గుర్తించి అనురా ధెరన్యూటిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై దాడి చేశారు. కంపెనీ ప్లాట్‌ నెంబరు 6బి పాలెం లక్ష్మారెడ్డి డ్రగ్‌ లైసన్స్‌ కింద`చేయకుండ అమ్మకాలు సాగిస్తు ఉండడంపై చర్యలు చేపట్టారు. ఈ దాడులు నిర్వహించిన వారిలో ఖైరాతాబాద్‌ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ శేర్‌లింగపల్లి డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.శైలజా, షామీర్‌పేట్‌ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి. ప్రవీణ్‌, మెహదీపట్నం డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.సంతోష్‌ లు ఉన్నారు.

కఠిన చర్యలు తీసుకుంటాం : వీబీ.కమలాసన్ రెడ్డి

తెలంగాణ డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్స్‌ నిబంద నాల మేరకు అమ్మకాలు జరుపుకుంటే చర్యలు తీసుకుంటామని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మిస్టేషన్ డైరెక్టర్ జనరల్ వి.బి. కమలాసన్‌రెడ్డి హెచ్చరించారు.లైసన్స్‌ లేకుండా మందుల నిల్వలు చేసిన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేకుండా డ్రగ్స్ నిల్వలు, అమ్మకాలు చేపట్టడం నేరం. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారి వివరాలను టోల్‌ ఫ్రీ నెంబర్ కు 18005996969 కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు.

Similar News