జల దిగ్భంధంలో జన జీవనం...

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారి వర్షాలకు కూకట్​పల్లి, మూసాపేట్​ జంట సర్కిళ్ల పరిధిలో జన జీవనం జల దిగ్భంధంలో చిక్కుకుంది.

Update: 2024-09-01 15:56 GMT

దిశ, కూకట్​పల్లి : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారి వర్షాలకు కూకట్​పల్లి, మూసాపేట్​ జంట సర్కిళ్ల పరిధిలో జన జీవనం జల దిగ్భంధంలో చిక్కుకుంది. రహదారులన్ని జలమయం అయ్యాయి. నాలాలలో ఉదృతి పెరిగింది, కొట్టుకు వచ్చిన చెత్త చెదారాన్ని జీహెచ్​ఎంసీ అధికారులు సకాలంలో తొలగించి కొన్ని కాలనీలు నీట మునగకుండా కాపాడారు. అదే విధంగా మూసాపేట్​లోని మైసమ్మ చెరువు నిండి నాలా పొంగి సమీపంలోని రాజీవ్​గాంధినగర్​, సఫ్దర్​నగర్​ కాలనీలు జలమయం అయ్యాయి. కాలనీలలో మొకాళ్ల లోతు నీరు చేరడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు.


రాజీవ్​గాంధీనగర్​, సఫ్దర్​నగర్​ కాలనీలలో జోనల్​ కమిషనర్​ అపూర్వ్​ చౌహాన్​, కార్పొరేటర్​ సబీహ బేగం, డీసీ రమేష్​, ఈఈ శ్రీనివాస్​, డీఈ ఆనంద్​, ఏఈ రంజిత్​లు పర్యటించారు. మైసమ్మ చెరువు సుందరీకరణ పనులలో భాగంగా కాముని చెరువు నుంచి మైసమ్మ చెరువుకు వచ్చే నాలాను చిన్న పైప్​లు వేసి డైవర్ట్​ చేయడంతో కాముని చెరువు నలా పొంగింది, దానికి తోడు మైసమ్మ చెరువులో వరద నీరు చేరి నీటి మట్టం పెరగడంతో చెరువులోని నీరు పక్కనే ఉన్న కాలనీలలో చేరింది. మూసాపేట్​ ఇంజనీరింగ్​ అధికారులు నాలాను జేసీబీల సహయంతో తవ్వి కాలనీలలో నీరు చేరకుండా చర్యలు తీసుకున్నారు. 48 గంటల పాటు వర్షసూచనలు ఉండటంతో సఫ్దర్​నగర్​లోని ప్రైవేటు పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్న ఏసీపీ శ్రీనివాస్​రావు, సిఐ వెంకట్​రెడ్డి, డీసీ రమేష్​లు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.



 



Similar News