ఫుట్ పాత్ సరే.. నడిచేదెలా..?

పూట్ పాత్ లు సరే నడిచేదెలా.. అని పాదచారులు

Update: 2024-10-28 13:44 GMT

దిశ, ఉప్పల్: పూట్ పాత్ లు సరే నడిచేదెలా.. అని పాదచారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉప్పల్ పిస్తా హౌస్ నుంచి బీరప్ప గడ్డ వెళ్లే దారిలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ దగ్గర కొన్ని నెలల నుంచి ఫుట్ పాత్ మీద చెట్ల కొమ్మలు ఉండటంతో నడవడానికి పాదాచారులు అవస్థలు పడుతున్నామని పూట్ పాత్ ను ఉపయోగించడం లేదని ఆరోపిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులకు పూట్ పాత్ ల మీద ఎవరైనా అక్రమంగా నిర్మించిన అక్రమాలను కూల్చడంలో ఉన్న శ్రద్ధ పూట్ పాత్ ల మీద అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడంలో లేదని పాదాచారులు అంటున్నారు. నిత్యం జీహెచ్ఎంసీ అధికారులు ఆ రోడ్డులో తిరుగుతుంటారు కానీ వాటిని పట్టించుకునే దాఖలాలు లేవు. ఇప్పటికైనా జిహెచ్ఎంసి అధికారులు చొరవ తీసుకుని చెట్ల కొమ్మలను తీసేసి నడిచే విధంగా చూడాలని పాదాచారులు కోరుతున్నారు.


Similar News