'ఉద్యోగ భద్రత కల్పించండి'.. మంత్రి మల్లారెడ్డికి వినతి పత్రం

'ఉద్యోగ భద్రత కల్పించండి'.. అంటూ దమ్మాయిగూడ మున్సిపాలిటి ఔట్ సోర్సింగ్ సిబ్బంది మంత్రి మల్లారెడ్డికి వినతి పత్రం అందించారు.

Update: 2023-08-26 12:34 GMT

దిశ, దమ్మాయిగూడ: 'ఉద్యోగ భద్రత కల్పించండి'.. అంటూ దమ్మాయిగూడ మున్సిపాలిటి ఔట్ సోర్సింగ్ సిబ్బంది మంత్రి మల్లారెడ్డికి వినతి పత్రం అందించారు. దమ్మయిగూడ మున్సిపల్ సిబ్బంది గత 30 సంవత్సరాల నుంచి పంచాయతీ మున్సిపాలిటీలో వివిధ శాఖలలో పనిచేస్తున్నా.. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని మంత్రికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నుకున్న దమ్మాయిగూడ మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం సభ్యలు పాల్గొన్నారు.


Similar News