నకిలీ పాల ఉత్పత్తి కేంద్రంపై దాడి.. భారీగా ముడిసరుకులు స్వాధీనం

మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో

Update: 2024-10-16 09:38 GMT

దిశ, మేడిపల్లి: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో నకిలీ పాల ఉత్పత్తుల తయారీ కేంద్రంపై మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసుల దాడి చేశారు. సికింద్రాబాద్ బోయిగూడ కి చెందిన గజేందర్ సింగ్ రాజ్ పురోహిత్ (51) కోహినూర్ పాల ఉత్పత్తుల కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే ఆ పాల ఉత్పత్తి కేంద్రంలో నకిలీ ఉత్పత్తులు చేపడుతున్నాడననే పక్కా సమాచారంతో ఎస్ ఓటి పోలీసులు దాడి చేశారు. నిందితుడి నుండి 300 కేజీల పన్నీర్, 4500 లీటర్ల రిఫైండ్ పామాయిల్, 750 లీటర్ల ఎసిటిక్ యాసిడ్, 16250 కేజీ ల స్కిమ్డ్ మిల్క్ పౌడర్, 15 లీటర్ల గ్లూకోజ్ లిక్విడ్, భారీగా ఇతర ముడి సరుకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గజేందర్ సింగ్ రాజ్ పురోహిత్ ను అదుపులోకి తీసుకొని, పాల ఉత్పత్తులను, ముడి సరుకులను స్వాధీనం చేసుకుని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు.


Similar News