హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం

హైదరాబాద్(Hyderabad) మహానగర వ్యాప్తంగా భారీ వర్షం(Heavy Rain) దంచికొడుతోంది. బుధవారం సాయంత్రం వరకు ఎండలు మండిపోయాయి.

Update: 2024-10-16 14:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad) మహానగర వ్యాప్తంగా భారీ వర్షం(Heavy Rain) దంచికొడుతోంది. బుధవారం సాయంత్రం వరకు ఎండలు మండిపోయాయి. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబబడింది. ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్, కోఠి, నారాయణగూడ, హిమాయత్ నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, ఉప్పల్, రామంతాపూర్, అంబర్‌పేట్, సికింద్రాబాద్, ప్యారడైస్, నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, శేరిలింగంపల్లి, ఎస్ఆర్ నగర్, కూకట్‌పల్లిలో వర్షం దంచికొడుతోంది. దీంతో ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి ఆ నీటిని నాలాల్లోకి మళ్లించాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు చాలా ప్రాంతాల్లో వరద నీరు రహదారులపైకి చేరడంతో ఇళ్లకు వెళ్లే సామాన్యులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


Similar News