తెలంగాణ ఇచ్చింది మేమే.. తెచ్చింది మేమే..
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అని పీఎంసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి అన్నారు.
దిశ, మేడిపల్లి : తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అని పీఎంసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి అన్నారు. ఎందరో అమరవీరుల త్యాగాల పునాదుల పై తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తుంగతుర్తి ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్థూపంవద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు 1200 మంది విద్యార్థుల నాయకుల త్యాగాలతో 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షలు రాష్ట్రం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంటికో ఉద్యోగం కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని చెప్పి ఇంతవరకు దాని గురించి మాట్లాడడం లేదన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అవినీతి తప్పా ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇంటికో ఉద్యోగం అన్న కేసీఆర్ వాడకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని తన ఇంటికి మాత్రం ఐదు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఎద్దేవ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల మారింది రాష్ట్ర సరిహద్దులు మాత్రమే కానీ ప్రజల జీవన ప్రమాణాలు మారలేదన్నారు. ఈ కార్యక్రమంలో పీఎంసీ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పన్నాల శ్రీనివాస్ రెడ్డి, కుర్వీ మహేష్, వంగేటి ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, ముదిగొండ రమేష్, ఎర్ర ఐలేష్ యాదవ్, ఎండీ మాజర్, యాసరం నగేష్, నర్సింహా రెడ్డి, గడ్డం రాంరెడ్డి, శ్రీలత బద్రు నాయక్, శ్రీకాంత్ పటేల్, బర్రె రాజు, ఉప్పరి ఉదయ్, పంగ రాజు, సైదానాయక్, రంగన్న గౌడ్, సాయి కిరణ్ రెడ్డి, సోమయ్య, మురళి, నందిత గౌడ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.