వ్యభిచారం నిర్వహిస్తున్న ‘బ్యూటిఫుల్స్టే’ పై పోలీసుల దాడి..
కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తూ బ్యూటిఫుల్స్టే పేరుతో కొనసాగుతున్న ఓయో లాడ్జిపై కేపీహెచ్‌బీ పోలీసులు, బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం దాడి చేసి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
దిశ, కూకట్పల్లి: కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తూ బ్యూటిఫుల్స్టే పేరుతో కొనసాగుతున్న ఓయో లాడ్జిపై కేపీహెచ్‌బీ పోలీసులు, బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం దాడి చేసి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వ్యభిచార గృహంలో 8 మంది మహిళలను రక్షించి రెస్య్కూ హోంకు తరలించారు. వారి వద్ద నుంచి రూ. 10 వేల నగదు, ఐదు సెల్‌ఫోన్ లు, 130 కండోమ్ ప్యాకెట్ లను స్వాధీనం చేసుకున్నారు. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కిషన్ కుమార్ వివరాలు వెళ్లడించారు.
కేపీహెచ్‌బీకాలనీ సర్దార్ పటేల్‌నగర్ కాలనీలో బ్యూటిఫుల్ స్టే ఓయో రూంలలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు, బాలానగర్ ఎస్ఓటీ పోలీసులతో కలిసి దాడి చేయడం జరిగిందని తెలిపారు. అందులో ఐదుగురు నిర్వాహకులలో అనితా హల్దార్ అలియాస్ సుజన్ మోండల్ (26), మిలన్ షీ(22), జ్యోతి మోండల్(20)లను పోలీసులు అదుపులో తీసుకోగా రాజ్ మోండల్, బిల్లు అలియాస్ మామ ఇద్దరు పరారీ లో ఉన్నట్లు సీఐ తెలిపారు. వ్యభిచార గృహం నుంచి బెంగాల్‌కు చెందిన 8 మంది మహిళలను రక్షించి రెస్క్యూ హోంకు తరలించినట్టు సీఐ వివరించారు.