భారీ వర్షాలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలి - ఎమ్మెల్యే బీఎల్ఆర్

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జిహెచ్ఎంసీ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సూచించారు.

Update: 2024-09-01 11:31 GMT

దిశ, కాప్రా : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జిహెచ్ఎంసీ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సూచించారు. వర్షాలతో నియోజకవర్గం పరిధిలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం కుషాయిగూడ డీ మార్ట్ ఎదురుగా గత రెండు నెలల కాలంగా ప్రధాన రహదారి పై డ్రైనేజీ పొంగుతూ శివ సాయి నగర్ వీధులను ముంచెత్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్ కాలువను కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జగన్ సర్కిల్ ఇంజనీరింగ్ ఈఈ హరిలాల్, ఏ కీర్తిలతో కలిసి పరిశీలించారు. జోరున కురుస్తున్న వర్షంలో శివసాయి నగర్, నాగార్జున నగర్ ఫేస్ 1, సాయి మిత్ర టవర్స్, వి.ఎన్.రెడ్డి నగర్ తదితర కాలనీల ప్రతినిధులతో కలిసి పొంగుతున్న అండర్ గ్రౌండ్ మురుగు కాల్వలను పాడైన రోడ్లను పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన పక్కాగా చర్యలు చేపట్టాలని డిప్యూటీ కమిషనర్ జగన్ ను ఆదేశించారు.

చర్లపల్లిలో.. చర్లపల్లి నుంచి ఐజి కాలనీ వెళ్లే మార్గంలో కల్వర్టు వద్ద నీరు చేరటంతో వాహనదారులు పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆదేశాల మేరకు అధికారులు స్పందించి మున్సిపల్ ఎఈ కీర్తి, డివిజన్ కాంగ్రెస్ నాయకులు బొడిగే ప్రభు గౌడ్, మొగిలి వెంకటేష్, భాను చందర్, మురళీ గౌడ్ వరదనీటి కాలువను పరిశీలించారు.

రోడ్లన్నీ జలమయం.. కూలిన చెట్లు..

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయమైయ్యాయి. పలు చొట్ల చెట్లు నేలకొరిగాయి. రోడ్లు చెరువులను తలపించాయి. జమ్మిగడ్డ నుంచి ఎల్లారెడ్డిగూడ వెళ్లే దారిలో భారీ వృక్షం రోడ్డు మధ్యలో కూలడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.


Similar News