ఐస్ ల్యాండ్ ను తలపించిన నిజాంపేట్..
నిజాంపేట్ కార్పొరేషన్ లోని ప్రగతినగర్, నిజాంపేట్ ప్రాంతాలలో భారీగా వడగండ్ల వర్షం కురిసింది.
దిశ, కుత్బుల్లాపూర్: నిజాంపేట్ కార్పొరేషన్ లోని ప్రగతినగర్, నిజాంపేట్ ప్రాంతాలలో భారీగా వడగండ్ల వర్షం కురిసింది. ఐస్ గడ్డలు కుండపోతగా పోస్తూ ఈ ప్రాంతంలోని పలు కాలనీలు ఐస్ ల్యాండ్ మాదిరిగా మారాయి. వడగండ్ల వర్షం ఇంత పెద్ద స్థాయిలో పడడంతో నిజాంపేట్, ప్రగతినగర్ ప్రజలు కొత్త అనుభూతిని పొందారు. హైదరాబాద్ లో ఉన్నామా స్విట్జర్ ల్యాండ్ లో ఉన్నామా అనే సందేహంలో ఉంటూ ప్రకృతిని ఆస్వాదించారు.