MLA Rajasekhar Reddy :వక్ఫ్ బోర్డు భూముల విషయంలో పేదలకు అన్యాయం

ఇటీవల వక్ఫ్ బోర్డు భూముల విషయంలో తీసుకున్న నిర్ణయంతో పేదలకు అన్యాయం జరుగుతుందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.

Update: 2024-11-05 13:08 GMT

దిశ, అల్వాల్ : ఇటీవల వక్ఫ్ బోర్డు భూముల విషయంలో తీసుకున్న నిర్ణయంతో పేదలకు అన్యాయం జరుగుతుందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మల్కాజిగిరి నాయకులతో కలిసి ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ భూముల సంరక్షణకు తాము వ్యతిరేకం కాదని లేఖలో పేర్కొన్నారు.

    కబ్జాలు చేసి కోట్లకు పడగెత్తిన బడాబాబుల మీద చర్యలు తీసుకోండి కానీ దశాబ్దాలుగా ప్రభుత్వాలకు అన్నిరకాల పన్నులు కడుతూ అక్కడే నివాసం ఉంటున్నపేద, మధ్యతరగతి ప్రజలను ఆగమాగం చేయొద్దని కోరారు. ప్రభుత్వ భూములను కబ్జాలు చేసేది పెద్దలే కానీ పేదలు కాదని గుర్తించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజిగిరి పేద ప్రజల పట్ల సానుకూలంగా స్పందించాలని లేఖలో కోరారు. ఈ కార్యక్రమంలో పరుశురాం రెడ్డి, డోలీ రమేష్,రాము యాదవ్ పాల్గొన్నారు.

Tags:    

Similar News