పత్రికా రంగంలో 'దిశ' ఒక ప్రభంజనం..: మంత్రి శ్రీధర్ బాబు

పత్రికా రంగంలో దిశ పత్రిక, డిజిటల్ మీడియా ప్రభంజనం

Update: 2025-01-03 07:07 GMT

దిశ,కుత్బుల్లాపూర్ : పత్రికా రంగంలో దిశ పత్రిక, డిజిటల్ మీడియా ప్రభంజనం సృష్టిస్తోందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం మినిస్టర్ క్వార్టర్స్ లో ఆయన దిశ పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా వార్తలు రాసే విషయంలో నో కాంప్రమైజ్ అన్న ధోరణిలో దిశ పత్రిక ఉండడం అభినందనీయమన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తూ పరిష్కారానికి 'దిశ' యాజమాన్యం, సిబ్బంది, జర్నలిస్టులు చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు.మేడ్చల్ జిల్లా బ్యూరో రవిచంద్ర ఆధ్వర్యంలో జరిగిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఆర్ సీ ఇంచార్జ్ లింగస్వామి,కూకట్పల్లి ఆర్ సీ ఇంచార్జి కరీం,మల్కాజిగిరి ఇంచార్జి మల్లేష్, ఉప్పల్ ఇంచార్జ్ శ్రవణ్ యాదవ్,రిపోర్టర్స్ మద్దయ్య(దుండిగల్ ),రాజ్ కుమార్ (మేడిపల్లి ) తదితరులు పాల్గొన్నారు.


Similar News