మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట : Minister Malla Reddy
మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు.
దిశ, మేడ్చల్ టౌన్ : మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు, కండ్లకోయలో రూ.4 కోట్ల 45 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు 3వ వార్డు కౌన్సిలర్ వీణ సురేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున బోనాలు, ఒగ్గు కళాకారులతో మంత్రి మల్లారెడ్డికి ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీలో గుండ్లపోచంపల్లికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. మున్సిపల్ పరిధిలోని 3, 9, 10 వార్డుల్లో సుమారు రూ.4కోట్ల 45 లక్షల నిధులతో అంతర్గత డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం, వైకుంఠ దామం, వీధిదీపాలు ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
పార్టీలకు అతీతంగా ఒక్కోవార్డుకు దాదాపు రూ.4కోట్ల నిధులు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. ప్రజసేవ చేయడంలో మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు నిరంతరం కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా వారిని మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ప్రభాకర్, కమిషనర్ రాములు, కౌన్సిలర్లు వీణ సురేందర్ గౌడ్, సముద్రాల హంసా కృష్ణగౌడ్, అమరం జైపాల్ రెడ్డి, భేరి బాలరాజు, అమరం హేమంత్ రెడ్డి, శ్రీలత శ్రీనివాస్ రెడ్డి, రజిత వెంకటేష్, చింత పెంటయ్య, కో అప్షన్ సభ్యులు దేవేందర్, జయశ్రీ జనార్దన్ రెడ్డి, మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, నాయకులు శివలింగల సురేందర్ గౌడ్, శ్రీహరి, రాజ్ కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.