అమోర్ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి హరీష్..
కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన అమోర్ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ మంత్రి టి. హరీష్రావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కే. నవీన్కుమార్లతో కలిసి ప్రారంభించారు.
దిశ, కూకట్పల్లి: కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన అమోర్ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ మంత్రి టి. హరీష్రావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కే. నవీన్కుమార్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ అందరికి వైద్యం అందుబాటులో ఉండే విధంగా ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కృషి చేయాలని సూచించారు. అనంతరం అమోర్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ కిషోర్ బీ. రెడ్డి మాట్లాడుతూ అత్యంత అనుభవజ్ఞులైన వైద్యులు, వైద్య సిబ్బంది, టెక్నీషియన్లతో 24 గంటలు వైద్యం అందించే విధంగా 250పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకు వస్తున్నామని అన్నారు.
ఆసుపత్రిలో రాడికల్ లాంజ్‌తో కూడిన అధునాతన క్యాథ్ ల్యాబ్, 1.5 టెస్లా ఎంఆర్ఐ సదుపాయం, అనేక ఆధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం, సాంకేతిక నిపుణులతో సంపూర్ణ చికిత్సలను అమోర్ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. ఆసుపత్రిలో 10 పడకల డయాలసిస్ సదుపాయంతో పాటు 2 ఐసోలేషన్ పడకలు, ఫుల్ రూమ్ డిఆర్ ఎక్సరే యంత్రం అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ పగుడాల శిరీష తదితరులు పాల్గొన్నారు.