Land Grab: దర్జాగా కబ్జా..! నిషేధిత స్థలంలో శాంభవతి లేక్ వ్యూ అపార్ట్‌మెంట్స్
బీఆర్ఎస్ ప్రభుత్వం ‘అధికార’ అండతో చెరువును చెరబట్టారు.
దిశ, మేడ్చల్ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వం ‘అధికార’ అండతో చెరువును చెరబట్టారు. బఫర్ జోన్‌లో రోడ్డు వేశారు. నిషేధిత జాబితాలో ఉన్న స్థలంలో బహు ళ అంతస్తులకు అనుమతులిచ్చా రు. దీంతో ‘ఎంఎస్ఎం వెంకట సాయి బిల్డర్స్’ నిర్మాణ సంస్థకు అడ్డు లేకుండా పోయింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం గ్రామ రెవెన్యూ పరిధిలోని ‘లింగం చెరువు’ బఫర్ జోన్‌ను కబ్జా చేసి‘శాంభవతి లేక్ వ్యూ’ అపార్ట్ మెంట్లను నిర్మించి, అమాయకులకు విక్రయించి రూ. కోట్లలో సొమ్ము చేసుకుంటుంది.
బఫర్ జోన్‌లో సైతం
సర్వే నెం. 87, 88, 89లో లింగం చెరువు బఫర్ జోన్‌లో కొద్దిమేర ప్రాంతం కలిసి ఉంది. సర్వే నెం. 87లో 0.016 గుం టల పట్టా భూమి, సర్వే నెం. 88లో 0.011 గుంటల పట్టా భూమి నిషేధిత జాబితాలో ఉన్న ట్లుగా ధరణి రికార్డుల్లో కనిపిస్తుంది. సర్వే నెం. 89లో 1.05 ఎకరాల భూమిని సుప్రభ పేరిట నాలా కన్వర్షన్ అయినట్లుగా చూపిస్తోంది. జీహెచ్ఎంసీ అధికారులను సదరు నిర్మాణానికి అనుమతులు సుప్రభా పేరిటనే జారీ చేశారు. నిషేధిత భూమిలో జీహెచ్ఎంసీ అధికారులు అనుమతులు జారీ చేయడంతో నిర్మాణ సంస్థ అపార్ట్‌మెంట్, కమర్షియల్ భవన నిర్మాణాలను దాదా పుగా పూర్తి చేసింది.
ఏంఎస్ఎం వెంకటసాయి బిల్డర్స్ నిర్మాణ సంస్థ నిషేధిత భూమిలో నిర్మా ణం చేయడంతో పాటు చెరువు బఫర్ జోన్ ప్రాంతాన్ని ఆక్రమిం చి రోడ్డు నిర్మాణం చేపడుతుంది. ఈ అక్రమ నిర్మాణాలపై సంబం ధిత శాఖలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. ఈ నిర్మా ణ సంస్థకు గత ప్రభుత్వ పెద్దల అండ ఉందని ఆరోపణలున్నా యి. అందుకే అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలున్నాయి. చెరువులను చెరబట్టిన వారిపై ‘హైడ్రా’ ఉక్కు పాదం మోపుతున్న క్రమంలో.. వీటిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నిషేధిత జాబితాలో..
సూరారం గ్రామ రెవెన్యూ పరిధి సర్వే నెం. 87, 88, 89 భూము ల్లో ‘ఎంఎస్ఎం వెంకటసాయి బిల్డర్స్’ అనే నిర్మాణ సంస్థ ‘శాంభవతి లేక్ వ్యూ అపార్ట్ మెంట్స్’ పేరిట కమర్షియల్, రెసిడెన్షియల్ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తుంది. సర్వే నెం. 87, 88, 89ను పేర్కొంటూ అపార్ట్‌మెంట్స్ నిర్మాణానికి అనుమతుల కోసం జీహెచ్ఎంసీలో దరఖాస్తు చేయగా 2022, ఏప్రిల్‌లో అనుమతులు జారీ చేసింది. సర్వే నెం. 87, 88లో ఉన్న భూమి ధరణి రికార్డుల ప్రకారం.. ప్రొహిబిటెడ్ లాండ్స్ జాబితాలో ఉండడం విశేషం. ధరణిలో నిషేధిత జాబితాలో ఉన్న భూమిలో జీహెచ్ఎంసీ ఏ విధంగా అనుమతులు జారీ చేసిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.