ప్రజా సంక్షేమం దిశగా నిర్ణయాలు ఉంటే ప్రజా పాలన సాధించినట్టే
ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రగతి నగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని మున్సిపల్ కార్మికులకు పీపీఈ కిట్లను అందజేశారు.
దిశ, కుత్బుల్లాపూర్ : ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రగతి నగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని మున్సిపల్ కార్మికులకు పీపీఈ కిట్లను అందజేశారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన కార్మికులను సన్మానించారు.
అనంతరం స్వానిధి స్వయం సహాయక బృందానికి రుణంగా మంజూరు చేసిన 2 కోట్ల 37 లక్షల 70 వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వమేదైనా ప్రజా సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నప్పుడే ప్రజా పాలన సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎండి. సాబీర్ అలీ, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యలు, సీనియర్ నాయకులు, నాయకులు, మహిళా నాయకులు, యువ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.