ప్రజా పరిపాలననా... ఫ్యాక్షనిస్టుల పాలనా...

కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజాపాలనలా లేదని, ఫ్యాక్షణిస్టు పాలనలా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రంగాలు వెనకబడ్డాయని బీఆర్ఎస్ ఎమ్యెల్యేలు విమర్శించారు.

Update: 2024-12-04 12:12 GMT

దిశ, దుండిగల్ : కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజాపాలనలా లేదని, ఫ్యాక్షణిస్టు పాలనలా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రంగాలు వెనకబడ్డాయని బీఆర్ఎస్ ఎమ్యెల్యేలు విమర్శించారు. గండిమైసమ్మలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు పై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో ఆరు గ్యారెంటీలను అమలుకు నోచుకోలేదన్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని విస్మరించిందన్నారు.

    ఎలాంటి ఆధారాలు లేకుండా మాజీ మంత్రి హరీష్ రావుపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టడం హాస్యాస్పదం అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్యెల్సి శంభిపూర్ రాజు, ఎమ్యెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Similar News