మేడ్చల్ నియోజకవర్గం యూత్ ఉపాధ్యక్షుడిగా రాము
ఇటీవల యూత్ కాంగ్రెస్ పదవి కోసం జరిగిన తీవ్ర పోటీలో మేడ్చల్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా శామీర్ పేట మండలం అలియాబాద్ గ్రామానికి చెందిన తంటం రాము గెలుపొందారు.
దిశ, మేడ్చల్ టౌన్ : ఇటీవల యూత్ కాంగ్రెస్ పదవి కోసం జరిగిన తీవ్ర పోటీలో మేడ్చల్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా శామీర్ పేట మండలం అలియాబాద్ గ్రామానికి చెందిన తంటం రాము గెలుపొందారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గం యూత్ ఉపాధ్యక్షుడిగా తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, తనపై నమ్మకంతో ఇచ్చిన ఈ పదవిని నమ్మకంతో నిర్వర్తిస్తానని అన్నారు. నియోజకవర్గంలోని యువతకు ఎటువంటి సహాయం కావాలన్నా తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్బంగా నియోజకవర్గంలోని ప్రజలు యువజన కాంగ్రెస్ నాయకులు, యువకులు శుభాకాంక్షలు తెలియజేశారు.