ఎడతెరపి లేని వర్షాలు... నేలకొరిగిన భారీ వృక్షాలు..

రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నాగారం మున్సిపాలిటీలో పలు కాలనీలలో వరద నీరు వచ్చి చేరడంతో.. స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి ఏర్పడింది.

Update: 2024-09-01 15:51 GMT

దిశ, కీసర : రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నాగారం మున్సిపాలిటీలో పలు కాలనీలలో వరద నీరు వచ్చి చేరడంతో.. స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నాగారం మున్సిపాలిటీ లోని పోచమ్మ ఆలయం వద్ద భారీ (40 సంవత్సరాల) వృక్షం నేలకొరిగింది. విద్యుత్ స్తంబాలు విరిగి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పలు కాలనీలలో చెట్లు విరిగిపడ్డాయి. కీసర గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రహరీ గోడ కూలిపోయింది. నాగారంలోని విశాల్ మార్ట్ వద్ద ప్రధాన రహదారిపై మోకాళ్ళ లోతు వరద నీరు ప్రవహిస్తుంది.

వరద ప్రాంతాలలో ఛైర్మన్‌ చంద్రారెడ్డి పర్యటన..

రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నాగారం మున్సిపాలిటీలో పలుకాలనీలలో వరద నీరు వచ్చి చేరడంతో.. వరద ప్రాంతాలను మున్సిపల్ ఛైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి కమిషనర్ జి.రాజేంద్ర కుమార్ తో కలిసి ఆదివారం పర్యటించారు. ఈ భారీ వర్షాలలో పడిపోయిన చెట్లను, విరిగిపోయిన స్తంభాలను పరిశీలించి మరమ్మతుల కోసం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎమర్జెన్సీ కోసం 9640010053 నెంబర్కు ఫోన్ చేయగలరని కోరారు. ఈ పరిశీలనలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


Similar News