హ్యాండ్ లూమ్ ఉత్పత్తులకు మంచి ఆదరణ: బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్

భారతీయ సంస్కృతి లో సిల్క్, హ్యాండ్ లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని నటి, బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ అన్నారు.

Update: 2023-07-22 12:12 GMT

దిశ, కంటోన్మెంట్/ బోయిన్ పల్లి: భారతీయ సంస్కృతి లో సిల్క్, హ్యాండ్ లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని నటి, బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని శ్రీ రాజ రాజేశ్వరీ గార్డెన్స్ లో శనివారం ఏర్పాటైన కృతి వీవ్స్ అండ్ క్రాప్ట్స్ హ్యాండ్ లూమ్ వస్త్ర ప్రదర్శన కీర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొలువుదీరిన చేనేత కారులు చేసిన వస్త్రోత్పత్తులను తిలకిస్తూ, వాటి తయారు గురించి తెలుసుకుంటూ సందడి చేశారు.

అనంతరం కీర్తి భట్ మాట్లాడుతూ.. హ్యాండ్ లూమ్ ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలేదన్నారు. అయితే హ్యాండ్ లూమ్ ఉత్పత్తుల తయారీకి చేనేత కారుల శ్రమ ఎంతో ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ చేనేతను ఆదరించాలని, అప్పుడే చేనేత కారుల కష్టానికి తగ్గ ఫలితం పరోక్షంగా ఇవ్వగలమన్నారు. నేటి తరం యువతలో కూడా హ్యాండ్ లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారన్నారు. నిర్వాహకులు యలమంచిలి శ్రీలత మాట్లాడుతూ.. ఈ నెల 30 వ తేది వరకు కొనసాగుతున్న ప్రదర్శన లో దేశంలోని 14 నగరాల నుంచి చేనేత కారులు , చేతి పని బృందాలు తమ సిల్క్ హ్యాండ్ లూమ్ చీరలు, డ్రెస్ మెటిరియల్ వంటి 70 వేల రకాల వస్త్రో ఉత్పత్తులను అందుబాటులో ఉంచామని తెలిపారు.

Tags:    

Similar News