కూకట్​పల్లిలో జీహెచ్​ఎంసీ కమిషనర్​ అమ్రపాలి పర్యటన...

కూకట్​పల్లి నియోజకవర్గంలో జీహెచ్​ఎంసీ కమిషనర్​ అమ్రపాలి కాట ఈ రోజుల ఉదయం జోనల్​ కమిషనర్​ అపూర్వ్​ చౌహాన్​, సర్కిల్​ ఇంజనీరింగ్​ అధికారులతో కలిసి పర్యటించారు.

Update: 2024-09-03 09:55 GMT

దిశ, కూకట్​పల్లి : కూకట్​పల్లి నియోజకవర్గంలో జీహెచ్​ఎంసీ కమిషనర్​ అమ్రపాలి కాట ఈ రోజుల ఉదయం జోనల్​ కమిషనర్​ అపూర్వ్​ చౌహాన్​, సర్కిల్​ ఇంజనీరింగ్​ అధికారులతో కలిసి పర్యటించారు. మూసాపేట్​ సర్కిల్​ పరిధిలో ముంపునకు గురైన సఫ్దర్​నగర్​, రాజీవ్​గాంధీనగర్​ కాలనీలలో పర్యటించి పరిస్థతిని సమీక్షించారు. భవిష్యత్తులో ముంపు సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. కాముని చెరువు నుంచి మైసమ్మ చెరువుకు మధ్య ఉన్న సర్​ప్లాస్​ నాలాను ఎస్​ఎన్​డీపీ ఫేజ్​2 కింద అభివృద్ధి చేయాలని, భవిష్యత్తులో ముంపు ప్రమాదం లేకుండా చర్యలు తీసుకోవాలని జోనల్​ కమిషనర్​ అపూర్వ్​ చౌహన్​కు సూచించారు.

అనంతరం ఐడీఎల్​ చెరువు కట్ట పై వినాయక నిమజ్జన ఏర్పాట్లను కమిషనర్​ అమ్రపాలి పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనం జరిగే ప్రాంతాలలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవలని, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదే విధంగ ముంపునకు గురైన కాలనీ వసులకు సురక్షిత తాగునీటిని సరఫరా చేయాలని, దోమల నివారణకు ఎంటమాలజి ఆధ్వర్యంలో ఫాగింగ్​ నిర్వహించాలని, యంటి లార్వ ఆపరేషన్​ పనులను చేపట్టాలని కమిషనర్ అమ్రపాలి కాట ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్​ఈ చెన్నారెడ్డి, డీసీ రమేష్​, ఈఈ శ్రీనివాస్​, డీఈ ఆనంద్​, ఏఈ రంజిత్​, కార్పొరేటర్​ సబీహ బేగంలు పాల్గొన్నారు.


Similar News