డ్రగ్స్,గంజాయి సరే..పేలుడు పదార్థాల పౌడర్‌లు సప్లై అయితే ఎలా?.. కలవరంలో పోలీసులు..

పోలీసుల్లో సరికొత్త టెన్షన్ మొదలైంది. ఇటీవల రాచకొండ

Update: 2024-01-21 15:00 GMT

దిశ,రాచకొండ : పోలీసుల్లో సరికొత్త టెన్షన్ మొదలైంది. ఇటీవల రాచకొండ పోలీసులు రాజస్థాన్ కు చెందిన డ్రగ్స్ ముఠా విచారణ తో పాటు ఇతర కేసు లలో మత్తు పదార్ధాలు సరఫరాను కొన్ని ప్రైవేటు కంపెనీ పాసెంజర్ ట్రావెల్ ఏజెన్సీ లైన రాపిడో, ఓలా, ఉబెర్ సంస్థలను ఉపయోగించుకుని సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ప్రక్రియ ఇప్పుడు పోలీసు లను పరేషాన్ చేస్తుంది. ఓ చిన్న కవర్ లో గంజాయి, డ్రగ్స్ పౌడర్లను పెట్టి వాటిని ఈ కంపెనీ ఏజెన్సీ ల ద్వారా బైక్ లను బుక్ చేసి అవసరం ఉన్నవారికి అందిస్తున్నారు. ఇలా ఈ బైక్ సర్వీస్ లను విద్రోహులు ఉపయోగించుకుంటే పరిస్థితి ఏంటని పోలీసుల్లో ఆందోళన రేపుతోంది. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు బైక్ ఏజెన్సీ కంపెనీ లకు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కంపెనీ మార్గదర్శకాలను చెక్ చేస్తామని రాచకొండ పరిధిలో డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న ఓ అధికారి తెలిపారు. ఈ వ్యవహారం పై చాలా కఠినంగా ఉంటామని పోలీసులు చెబుతున్నారు.

రోడ్డు పై టెంట్ వారి ఆఫీస్ - సలాఉద్దీన్, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫార్మ్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు

రాపిడో, ఉబెర్, ఓలా వంటి కంపెనీలకు మన దగ్గర ఆపరేషన్ కార్యాలయాలు లేవు. రోడ్డు ఫై టెంట్ వేసుకుని మధ్యవర్తుల ద్వారా ఆర్ సీ, డ్రైవింగ్ లైసెన్స్ తో రిజిస్టర్ చేసి ఇస్తారు. ఆ తర్వాత అంతా యాప్ లోనే. ఇలాంటి పద్ధతి ఉండడం వల్లనే గంజాయి, డ్రగ్స్ వంటివి సరఫరా అవుతున్నాయి. వీటికి కంపెనీ బాధ్యత వహించాలి, కాని వారు చేతులు ఎత్తేస్తున్నారు. కంపెనీలు పారదర్శకంగా ఉండాలి. కంపెనీ ట్రాకింగ్ డేటా ప్రభుత్వం, పోలీసు లకు అనుసంధానం ఉండాలి. కానీ ఇలాంటి కేసులు కాగానే డేటా ను డిలీట్ చేసేస్తున్నారు. దర్యాప్తుకు సహకరించరు.అదే కాకుండా ఇలా ప్యాసింజర్ లను కాకుండా కవర్ లు ఇతర వస్తువులను తీసుకెళ్లే సమయం లో వస్తువు కనపడే విధంగా ప్యాకింగ్ ఉండాలని డిమాండ్ చేసిన వారు పట్టించుకోవడం లేదు.

చాలా సందర్భాల్లో యాప్ లో బుకింగ్ చేసినప్పుడు ఒక వాహనం నెంబర్, డ్రైవర్ ఫోటో, ఫోన్ నెంబర్ కనబడుతుంది. కానీ పాసింజర్ ను, కవర్ ను తీసుకువెళ్లేందుకు వచ్చే వారు వేరుగా ఉంటున్నారని చాలా సందర్భాల్లో గుర్తించాం, ఫిర్యాదులు వచ్చాయి, ఆపరేషన్స్ కార్యాలయాలు లేకపోవడం వల్లనే గుర్తించాం. కంపెనీ లతో మాట్లాడి ఎవరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసాం.ఫలితం ఇప్పటివరకు లేదు.

Read More..

డబ్బుల కోసం యువకుడిని హత్య చేసిన దుండగులు 

Tags:    

Similar News