కుక్కల స్వైర విహారం.. బ్లూ క్రాస్‌ ఆధ్వర్యంలో పట్టివేత

దమ్మాయిగూడ మున్సిపల్ పరిధి పలు కాలనీలలో వీధి కుక్కలు ఎక్కువగా సంచరించి చిన్న పిల్లలను, పెద్దవారిని కరిచి ఇబ్బందికి గురి చేస్తుండటంతో మున్సిపల్ చైర్మన్ ప్రణీత శ్రీకాంత్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

Update: 2023-03-04 11:33 GMT

దిశ, దమ్మాయిగూడ: దమ్మాయిగూడ మున్సిపల్ పరిధి పలు కాలనీలలో వీధి కుక్కలు ఎక్కువగా సంచరించి చిన్న పిల్లలను, పెద్దవారిని కరిచి ఇబ్బందికి గురి చేస్తుండటంతో మున్సిపల్ చైర్మన్ ప్రణీత శ్రీకాంత్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె బ్లూ క్రాస్‌ వారి ద్వారా ఏడు కుక్కలను పట్టుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు వసుపతి రమేష్ గౌడ్, మాదిరెడ్డి నరసింహరెడ్డి, రామారం శ్రీహరి గౌడ్ , మున్సిపల్ మేనజర్ వెంకటేశం, సానిటరీ ఇన్ స్పెక్టర్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News