ఉద్యోగ అవకాశాల పై యువతతో చర్చ..
కేఫ్ పాలిటిక్స్' పేరుతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తెలంగాణ మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ క్రిశాంక్ ప్రారంభించారు.
దిశ, కంటోన్మెంట్/ బోయిన్ పల్లి : కేఫ్ పాలిటిక్స్' పేరుతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తెలంగాణ మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ క్రిశాంక్ ప్రారంభించారు. కంటోన్మెంట్ యువకులు పార్టీ రాజకీయాల నుండి, అన్ని సమస్యల వరకు ఈ కార్యక్రమంలో తెలుసుకుంటూ, ఉపాధి అవకాశాలు గురించి చర్చించుకోవాలన్నారు. అనంతరం క్రిశాంక్ మాట్లాడుతూ యువకులు మాట్లాడటం, చర్చించుకోవడం చాలా ముఖ్యం అన్నారు. 'కేఫ్ పాలిటిక్స్' అనేది తన హృదయానికి దగ్గరగా ఉన్న కార్యక్రమం అని, యువకులు వారి ఆలోచనలను వ్యక్తపరచడానికి వేదికగా మారుతున్నాయన్నారు.
కేఫ్ పాలిటిక్స్ కార్యక్రమంలో యువత స్థానిక సమస్యలు, రాజకీయాలు, ఉన్నత స్థాయి కంపెనీల్లో అవకాశాల గురించి చర్చించేందుకు ముందుకు వస్తున్నారన్నారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగావకాశాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాముఖ్యతపై యువతకు అవగాహన కలుగుతుందని క్రిశాంక్ అన్నారు. కేఫ్ పాలిటిక్స్ కార్యక్రమానికి కంటోన్మెంట్ లోని అన్ని కేఫ్ లు వేదికలుగా మారుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సంజయ్, నవీన్, రఘు, కళ్యాణ్, హరీష్, ఉదయ్ తదితర యువకులు పాల్గొన్నారు.