ప్రజల ప్రాణాలు పోతుంటే రాజకీయాలా ?
ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు మందముల పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ లో శుక్రవారం ధర్నా చేపట్టారు.
దిశ, ఉప్పల్ : ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు మందముల పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ లో శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ మందముల రజిత పాల్గొన్నారు. ఎ బ్లాక్ అధ్యక్షులు పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎలివేటెడ్ కారిడార్ పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని ఉప్పల్ నియోజకవర్గం ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. కారిడార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగాట ఆడుతున్నాయని దుయ్యబట్టారు. దొంగనే దొంగ దొంగ అన్నట్టుగా కారిడార్ పేరుతో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు దొంగ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
కారిడర్ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయకపోవడంతో జరిగిన ప్రమాదాలతో సుమారు 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారన్నారు. ఎలివేటెడ్ కారిడార్ పనులను వెంటనే పూర్తి చేయాలని, కారిడార్ కారణంగా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ ఆధ్వర్యంలో ఉప్పల్ లో శుక్రవారం ధర్నా చేపట్టారు. రెండు ఏళ్ళల్లో కారిడార్ పనులను పూర్తి చేయాల్సి ఉండగా ఐదేళ్ళు అయినప్పటికీ పదిశాతం పనులు కూడా పూర్తి కాలేదని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు పనుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. కానీ ప్రచారం మాత్రం చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఉప్పల్ లో ఆస్తులు కోల్పోయిన యజమానులకు అరకొర పరిహారం ఇచ్చి అభివృద్ధి పేరుతో మోసం చేశారని దుయ్యబట్టారు.
ఈ రెండు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రతినిధులు మేకల శివారెడ్డి, ఎం.డీ తౌఫిక్, టీపీసీసీ సెక్రట్రీ పసుల ప్రభాకర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ కౌన్సిలర్ కృష్ణ రెడ్డి, బోరంపేట కృష్ణ ముదిరాజ్, తుంగతుర్తి రవిచారి, చెన్ రెడ్డి రఘపతి రెడ్డి, ఎం.డీ షఫీ, డివిజన్ అధ్యక్షులు బాకారం లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ ఉప్పల్ అధ్యక్షులు ఆకారపు అరుణ్ , ఏ -బ్లాక్ ఎస్.సీ సెల్ అధ్యక్షులు లింగంపల్లి రామకృష్ణ, ఎండీ గౌస్, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ జి భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులు పోలిశెట్టి సుధాకర్, గోపాల్, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంచాలా రఘు, రామంతపూర్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వలపు శ్రీకాంత్ యాదవ్, నాచారం యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు నెమలి సునిల్ రెడ్డి, మహిళ కాంగ్రెస్ నాయకులు శోభ, విజయ, భాగ్యలక్ష్మి, సుజాత, జ్యోతి, మమత, సుధ, రేణుక, లక్ష్మీదేవి, రాణి, తదితరులు పాల్గొన్నారు.