దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది: మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు.

Update: 2023-06-03 17:56 GMT

దిశ, శామీర్ పేట: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక, శామీర్ పేట్ మండలంలోని అలియాబాద్ రైతు వేదికల వద్ద నిర్వహించిన రైతు దినోత్సవాల్లో కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ఘనంగా నిర్వహించారు. మూడుచింతలపల్లి లో బోనాలతో మంత్రి మల్లారెడ్డికి స్వాగతం పలికి ట్రాక్టర్ పై ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ సారధ్యంలో రైతులకు అన్ని సదుపాయాలు కల్పించారని, రైతు భీమా, రైతు బందు, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతులకు సొసైటీల ద్వారా సబ్సీడీలు, తక్కువ ధరలకే ఎరువులు అందిస్తూ రైతులకు మేలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణ రాష్ట్రంగా ఎదిగిందని, అది సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, డీసీఎంఎస్ వైస్ ఛైర్మన్ మధుకర్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ జిల్లా రైతుబందు అధ్యక్షులు నందారెడ్డి, మూడుచింతలపల్లి, శామీర్ పేట్ మండలాల ఎంపీపీలు హారిక మురళీ గౌడ్, ఎల్లు బాయి బాబు, శామీర్ పేట్, జెడ్పీటీసీ అనిత లాలయ్య, మూడుచింతలపల్లి, శామీర్ పేట్ మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, విలసాగరం సుదర్శన్,సర్పంచులు, రైతులు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News