కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సింగిల్ డిజిట్ కే పరిమితం: మంత్రి మల్లారెడ్డి
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలు ఇప్పుడున్నది సింగల్ డిజిట్ నే అని, రాబోయే ఎన్నికల్లో కూడా ఆ పార్టీలు సింగిల్ డిజిట్ కే పరిమితమవుతాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి జ్యోస్యం చెప్పారు.
దిశ, మేడ్చల్ టౌన్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలు ఇప్పుడున్నది సింగల్ డిజిట్ నే అని, రాబోయే ఎన్నికల్లో కూడా ఆ పార్టీలు సింగిల్ డిజిట్ కే పరిమితమవుతాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి జ్యోస్యం చెప్పారు. బుధవారం తూముకుంట మున్సిపాలిటీ పరిధిలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో గుండ్ల పోచంపల్లి మున్సిపల్ ఛైర్పర్సన్ మద్దుల లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గుండ్ల పొచంపల్లీ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలకు ఏం చేశారని ఏ మొహం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతారని మంత్రి ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉండి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుండ్ల పోచంపల్లి చైర్పర్సన్ లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, గుండ్ల పోచంపల్లి మున్సిపల్ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్, వైస్ చైర్మన్ ప్రభాకర్, రాష్ట్ర నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు వీణా, రజిత, మల్లికార్జున్ ,హేమంత్, జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.