Collector Gautham : రిజర్వేషన్ల దామాషాపై 7న అభ్యంతరాల స్వీకరణ

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించాల్సిన అవసరమైన రిజర్వేషన్ల దామాషాను పేర్కొనే విషయంలో ఆసక్తి కలిగిన పార్టీల నుంచి, ప్రజల నుంచి అభ్యర్ధనలు, సలహాలు, అక్షేపనలు 7వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వీకరించనున్నట్టు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం పొట్రు శనివారం తెలిపారు.

Update: 2024-11-02 13:02 GMT

దిశ, ఘట్కేసర్ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించాల్సిన అవసరమైన రిజర్వేషన్ల దామాషాను పేర్కొనే విషయంలో ఆసక్తి కలిగిన పార్టీల నుంచి, ప్రజల నుంచి అభ్యర్ధనలు, సలహాలు, అక్షేపనలు 7వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వీకరించనున్నట్టు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం పొట్రు శనివారం తెలిపారు.

    బహిరంగ విచారణను తెలంగాణ బీసీ కమిషన్, రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) లో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలోని సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, మెంబర్ సెక్రటరీతో కూడిన సభ్యుల బృందం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. కావున ఆయా కులాల స్థితిగతులపై తెలంగాణ బీసీ కమిషన్ బృందానికి పై మేరకు అభిప్రాయాలు తెలపాలని కోరారు. పూర్తి సమాచారం కోసం www.telangana.gov.in వెబ్ సైట్ లో సంప్రదించాలని సూచించారు. 

Tags:    

Similar News